మహబూబ్‌నగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన జాజిలి రాములు అనే వ్యక్తి మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఏడాది కింద రాములుకు వివాహం జరిగింది. గత శనివారం అనారోగ్యానికి గురైన రాములును ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని సూచించారు.
ఒకడిగా మరణించి.. నలుగురిలో జీవిస్తున్నాడు... - organ donation in mahabubnagar district
తన భర్త.. మరణించినా.. నలుగురిలో బతుకుంటాడని ఆ వైద్యులు చెప్పిన మాటను ఆమె నమ్మింది. అవయవ దానం చేస్తే మరో నలుగురి ప్రాణాలు నిలబడతాయని చెబితే సరే అంది. జీవితాంతం తోడుంటానని బాసలు చేసిన భర్త.. బ్రెయిన్ డెడ్ అయి నిర్జీవంగా పడి ఉండటం చూసిన ఆమె.. ధైర్యం కోల్పోకుండా మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంగీకరించింది.
అవయవదానం, మహబూబ్‌నగర్ జిల్లా
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేసిన వైద్యులు.. రాములు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోవడం వల్ల బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధరించారు. అతని అవయవాలు దానం చేస్తే నలుగురి ప్రాణాలు నిలబడతాయని రాములు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఎట్టకేలకు అవయవ దానానికి అతని కుటుంబం అంగీకరించింది.
- ఇదీ చదవండి :అవయవ దాత కుటుంబానికి ఆర్థిక సహాయం