Online Kidney Fraud:తండ్రి ఖాతాలోని డబ్బు అవసరాలకు వాడుకున్న ఓ అమ్మాయి.. కిడ్నీ అమ్మి ఆ డబ్బు ఇవ్వాలనుకుని చివరకు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన ఇంటర్ విద్యార్థినికి యామిని హైదరాబాద్‌లో నర్సింగ్ చేస్తోంది. అవసరాల కోసం ఆమెకు తన తండ్రి ఏటీఎం కార్డు ఇచ్చారు. దాంతో అందులో నుంచి 2 లక్షల రూపాయల వరకూ వాడుకుంది. ఆ డబ్బును రికవరీ చేయడం కోసం కిడ్నీ అమ్మాలని ఆన్‌లైన్‌లో కనిపించిన నంబర్‌ను సంప్రదించింది.
కిడ్నీ అమ్మాలనుకుంది.. రూ.16 లక్షలు పోగొట్టుకుంది - ఏపీ క్రైమ్ న్యూస్
Online Kidney Fraud: ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు డబ్బు దోచుకోడానికి ఎన్నో మార్గాలు ఎంచుకుంటున్నారు. కొత్త కొత్త మోసాలతో అమాయకులనే ఆసరాగా చేసుకొని మనీని మాయం చేస్తున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది. తండ్రి ఖాతాలోని డబ్బు అవసరాలకు వాడుకున్న ఓ అమ్మాయి.. కిడ్నీ అమ్మి ఆ డబ్బు ఇవ్వాలనుకుని చివరకు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కింది. అసలేం జరిగిందంటే..!
కిడ్నీ అమ్మాలనుకుంది.. రూ.16 లక్షలు పోగొట్టుకుంది
అనంతరం ఆమె అవసరాన్ని గుర్తించిన సైబర్ నేరగాళ్లు.. రూ.3 కోట్లు ఇస్తామంటూ ఎరవేశారు. పన్నుల కింద దఫదఫాలుగా రూ.16 లక్షలు గుంజారు. కొంత కాలానికి మోసపోయానని గుర్తించిన యామిని తన తండ్రితో కలిసి.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయగా అనవసరమైన లింకులపై క్లిక్ చేసి మోసపోవద్దని తెలిపారు.
ఇవీ చదవండి: