తెలంగాణ

telangana

ETV Bharat / crime

ONLINE FRAUD: సైబర్​ నేరగాళ్ల వలలో పడి.. రూ.75వేలు సమర్పణ - ఖమ్మం జిల్లా తాజా నేర వార్తలు

ONLINE FRAUD: సాధారణంగా ఏదైనా వస్తువు కొనాలంటే షాపింగ్ మాల్ కు వెళతాం.. కానీ ఈ కాలంలో అధిక శాతం ప్రజలు ఆన్​లైన్ సైట్లపై ఆధారపడుతున్నారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేయాలని వివిధ వెబ్​సైట్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆర్మీ అధికారుల పేరుతో నకిలీ ఫొటోలు పంపించి అమాయకులను అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.

ప్రవీణ్
ప్రవీణ్

By

Published : Jun 24, 2022, 7:24 PM IST

ONLINE FRAUD: మీరు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు అని ఒకరు .. అతి తక్కువ ధరకే మీకు వస్తువులు విక్రయిస్తాం అని మరొకరు .. ఇలా సైబర్​ నేరగాళ్లు రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆశపడి ఆకర్షితులైతే వారిని నిలువుదోపిడీ చేస్తారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. కారేపల్లి మండలం బీక్యాతండాకు చెందిన ప్రవీణ్ సెకండ్ హ్యాండ్ ల్యాప్​టాప్​ కోసం ఆన్​లైన్​లో వెతికాడు. తన ఫేస్​బుక్​ ఖాతాలో ఉన్న ఓ ప్రకటన అతడిని ఆకర్షించింది. అందులో సెకండ్ హ్యాండ్ ల్యాప్​టాప్​లు తక్కువ ధరలకే విక్రయిస్తామని అందులోని సారాంశం. దీంతో ఆయువకుడు అందులోని నెంబర్​కి ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి స్పందించి తాను ఆర్మీ అధికారినని ల్యాప్​టాప్​ విలువ రూ.13,500 అని మీకు రూ.12వేలకే ఇస్తామని ప్రవీణ్​ని నమ్మించాడు. ముందుగా నగదు బదిలీ చేయాలని మరుసటి రోజు ల్యాప్​టాప్​ను ఇంటివద్దకే డెలీవరి చేస్తామని తెలిపాడు.

ఆవ్యక్తి ఆర్మీకి సంబంధించిన అతడి ఐడీకార్డు, ఆధార్ వివరాలు పంపడంతో ప్రవీణ్​ నమ్మాడు. వారు చెప్పిన నెంబర్​కి దశల వారిగా రూ.6 వేలు, మరోసారి రూ.3,900,రూ.2,100 పంపించాడు. ల్యాప్​టాప్ కోసం పంపిన నగదు ఇంకా జమకాలేదని అవి హోల్డ్​లో పడ్డాయని బాధితుడితో మాట్లాడిన వ్యక్తులు అతని నుంచి రూ.75,400 వరకు రాబట్టారు. అనంతరం వారు ఫోన్​లో అందుబాటులోకి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ABOUT THE AUTHOR

...view details