హైదరాబాద్ ఎల్బీనగర్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది (cricket betting gang arrested at lbnagar). టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌ల సందర్భంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు (online cricket betting gang arrested ). నిందితుల నుంచి రూ.14.92 లక్షల నగదు, లాప్టాప్, 8 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకుడితో పాటు.. 4 పంటర్లను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
కొత్తపేటకు చెందిన శ్రీధర్.. కోఠిలో జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఏడాది కాలంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న శ్రీధర్... తన నలుగురు స్నేహితులను కలుపుకొని క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పందెం కాస్తున్నాడు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌లు డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో... ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టి నిందితుల ఇళ్లల్లో దాడి చేసి పట్టుకున్నారని మహేశ్ భగవత్ తెలిపారు. ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ హెచ్చరించారు.