తెలంగాణ

telangana

ETV Bharat / crime

Car accident: అమెరికా వెళ్లాల్సిన యువకుడు.. అనంత లోకాలకు.. - దూసుకెళ్లిన కారు

Car accident: అతివేగం, అజాగ్రత్తతో కారు నడపడంతో బోల్తా పడి, అమెరికాకు వెళ్లాల్సిన యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పరివేద శివారులో చోటు చేసుకుంది.

Car accident
Car accident

By

Published : May 16, 2022, 5:12 AM IST

Updated : May 16, 2022, 10:27 AM IST

Car accident: సిద్దిపేట జిల్లాలో పొలాల్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో యువకుడు చనిపోగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొహెడ మండలం పర్వేద శివారులో కారు టైరు పగిలి అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే రఘునందన్‌ రెడ్డి అనే యువకుడు చనిపోయాడు.

రఘునందన్‌ రెడ్డి

మరో వారం రోజుల్లో రఘునందన్‌ రెడ్డి ఉద్యోగంలో చేరేందుకు అమెరికాకు వెళ్లాల్సి ఉండగా ప్రమాదం జరగడంతో.. ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వ్యక్తిగత పనుల నిమిత్తం రఘునందన్‌, రాందివాకర్‌ రెడ్డి కారులో పరివేద నుంచి కొహెడకు వెళ్తుండగా కారు అదుపుతప్పి సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లింది. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు రఘునందన్‌ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

రఘునందన్‌రెడ్డి తండ్రి సంపత్‌రెడ్డికి రఘునందన్‌రెడ్డితో పాటు కుమార్తె సంతానం. బీటెక్‌ పూర్తి చేసిన రఘునందన్‌.. ఉన్నత చదువు కోసం పది రోజుల్లో అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఎన్నెన్నో ఆశలతో పెంచి పెద్ద చేసిన ఏకైక కుమారుడు ప్రమాదంలో కన్నుమూయడంతో తల్లిదండ్రులు ఏకధాటిగా విలపిస్తున్నారు. సంతోషంగా ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి ఇలా విగతజీవుడై రావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

ఇవీ చూడండి:పుట్టుకతో చెవిటి, మూగ యువతిపై బంధువు అత్యాచారం..

బిహార్​లో బాల్యవివాహం.. మాకేం తెలీదన్న పోలీసులు!

Last Updated : May 16, 2022, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details