నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కారును స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఘటనలో శివాణి అనే ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
హైదరాబాద్ నాగోల్ బండ్లగూడకు చెందిన సత్యయ్య, సంపూర్ణ దంపతులు బంధువులతో కలిసి రెండు కార్లలో శ్రీశైలం దర్శనానికి బయలుదేరారు. దోమలపెంట సమీపంలోని మలుపు వద్ద వాహనాలను నిలిపి.. అల్పాహారం తింటుండగా వెనక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం అదుపు తప్పి శివాణిని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. డ్రైవర్‌కూ గాయాలయ్యాయి.