తెలంగాణ

telangana

ETV Bharat / crime

'అమ్మా.. నీ కాళ్లు పట్టుకుంటాం ఇంటికి రా'.. తల్లి కోసం పిల్లల వేదన.!

One Wife and Two Husbands News: 'అమ్మా' అని ఎవరు పిలిచినా.. మాతృ హృదయం ఉన్న ఏ తల్లైనా సరే కడుపున పుట్టకపోయినా కరిగిపోతుంది. వారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయతను పంచుతుంది. కానీ ఈ తల్లి మాత్రం 'మీరు అసలు నా పిల్లలే కాదు' అంటోంది. కాళ్లు పట్టుకున్నా కూడా కనికరం లేకుండా దూరంగా నెట్టేస్తోంది. కనీసం వారిని తాకడానికి కూడా ఇష్టపడటం లేదు.' ఇంటికి రా అమ్మా.. నువ్వు మాకు కావాలి' అని అభ్యర్థించినా మీతో నాకు సంబంధం లేదు.. అని కఠినంగా చెప్పేసింది. తల్లి కోసం ఆ పిల్లలు పడుతున్న వేదన.. అక్కడున్న వారిని కలచివేస్తే.. ఆమె మాత్రం చీమ కూడా కుట్టనట్లుగా వ్యవహరించింది. హైదరాబాద్​ ప్రెస్​ క్లబ్​లో మీడియా ఎదుట ఓ భార్య, ఇద్దరు భర్తలు, ఇద్దరు పిల్లల కథ ఇది.

one wife and two husbands news
ఓ భార్య, ఇద్దరు భర్తలు, పిల్లలు

By

Published : Jan 3, 2022, 6:09 PM IST

One Wife and Two Husbands News: పిల్లలను వదిలి వేరే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్న తల్లిని... ఇంటికి రమ్మంటూ కాళ్లు పట్టుకుని కూతురు విలపించిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఘటన హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఓ మీడియా సమావేశం సందర్భంగా చోటుచేసుకుంది. 20 ఏళ్ల క్రితం హనుమకొండకు చెందిన శశికాంత్​తో కాజీపేటకు చెందిన మహిళకు వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మహిళకు కొంతకాలం క్రితం ఫేస్​బుక్​ ద్వారా.. ఏపీలోని అమలాపురం కొత్తపేటకు చెందిన రాయుడు సత్యవరప్రసాద్​తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో గత ఆగస్టు 20 న పుట్టింటికని వెళ్లిన మహిళ తిరిగిరాలేదు. ఇంట్లో ఉన్న బంగారు నగలు, 25 తులాల వెండి ఆభరణాలు, లక్ష నగదు కూడా మాయమవడంతో సుబేదారి పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో మహిళ, సత్యవరప్రసాద్.. హైదరాబాద్​లోని బల్కంపేట ప్రశాంత్ కాలనీలో సహజీవనం చేస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహాల్లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఎట్టకేలకు వీరి జాడ గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

మహిళ ట్విస్టు

ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఆమె.. ఈరోజు ప్రెస్​క్లబ్​లో మీడియా ఎదుట మాట్లాడింది. శశికాంత్ తన భర్తే కాదని.. తన అక్క భర్త అని.. అక్క చనిపోతే పిల్లలను సాకానని చెబుతోంది. ఆ పిల్లలు తన పిల్లలు కాదంటూ మీడియా ఎదుట బుకాయించింది. 'మీరే నా పిల్లలైతే నన్ను పోలీసుస్టేషన్​లో పోలీసులు చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఎందుకు రాలేద'ని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మహిళ సరైన సమాధానాలు చెప్పలేదు. 'పిల్లలతో నాకు సంబంధం లేద'ని తెగేసి చెప్పింది.

బోరున విలపించిన పిల్లలు

జైలు నుంచి విడుదలయ్యాక కూడా మహిళ, రెండో భర్త తమ బంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో మొదటి భర్త.. తనకు విడాకులు ఇవ్వకుండా వాళ్ల రెండో పెళ్లి చెల్లదని పోలీసులను ఆశ్రయించారు. తన పిల్లల కోసమైనా ఆమెను తమ వద్దకు పంపాలంటూ ఎస్ఆర్​నగర్ పోలీసులను శశికాంత్​ కోరడంతో ఈ విషయంలో ఏమి చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే జైలు నుంచి విడుదలయిన మహిళ.. పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఈ రోజు సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలుసుకున్న మొదటి భర్త, కుమారుడు, కుమార్తె అక్కడికి చేరుకుని ఆమెను ఇంటికి రావాలంటూ బతిమిలాడారు. ఇంటికి రమ్మని కూతురు.. తల్లి కాళ్లు పట్టుకుంది. పిల్లలు బోరున విలపించినా ఆమె మనసు కరగలేదు. వారిని మానవత్వం మరిచి నెట్టివేసింది. 'మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు' అని వారిని అక్కడి నుంచి నెట్టివేసింది. అంతే కాకుండా రెండో భర్త ఏకంగా వారిపై దాడికి కూడా దిగాడు.

ఇదీ చదవండి:father in law kills daughter in law: కోడలి గొంతు కోసి హత్య చేసిన మామ

ABOUT THE AUTHOR

...view details