తెలంగాణ

telangana

ETV Bharat / crime

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా... ఒకరు మృతి - కొత్తగూడెం జిల్లాలో ట్రాక్టర్ బోల్తా

కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తాపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

one person was killed when a tractor overturned in bhadradri kothagudem district
కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా... ఒకరు మృతి పలువురికి గాయాలు

By

Published : Feb 7, 2021, 1:44 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభుని గూడెం గ్రామంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన వట్టం సమ్మయ్య అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వారిని 108 వాహనంలో ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 35 మంది కూలీలున్నారని స్థానికులు తెలిపారు. వారంతా శంభుని గూడెం నుంచి పోతిరెడ్డి పల్లి గ్రామానికి కూలీ పనుల కోసం వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో ఏనుగు సమ్మక్క, సరోజ, పాపమ్మ అనే మహిళల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

ABOUT THE AUTHOR

...view details