ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీసింది. ములుగు జిల్లా కేంద్రంలోని ఓ కోళ్ల ఫారంలో బంధాల వేయందర్, శ్రీరాముల భాస్కర్ అనే ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ పడ్డారు. ఆగ్రహించిన వేయందర్ మొలలు కలిగిన సెంట్రింగ్ కర్రతో భాస్కర్ తలపై బలంగా బాదాడు.
చిన్న లొల్లి హత్యకు దారితీసింది! - telangaqna news
ఇద్దరి మధ్య వచ్చిన తగాదా ఒకరి నిండు ప్రాణం తీసింది. సెంట్రింగ్ కర్రతో తలపై బాదడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.
హత్య చేశాడు.. లొంగిపోయాడు..!
బలంగా గాయం అయిన భాస్కర్.. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన వేయందర్ పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు ఏం తెలియకపోవడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి:ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదు.. అదో నాటకం: సీపీ