తెలంగాణ

telangana

ETV Bharat / crime

కొత్తపల్లి వాగులో కారుతో సహా ఒకరు గల్లంతు - తెలంగాణ తాజా వార్తలు

రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి వాగులో కారుతో సహా ఒకరు గల్లంతయ్యారు. చేవెళ్ల మండలం ఎనికేపల్లి నుంచి కౌకుంట్ల వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రాత్రి కావడం వల్ల కారు సహా గల్లంతైన వారి ఆచూకీ తెలియడం లేదని స్థానికులు తెలిపారు.

కొత్తపల్లి వాగులో గల్లంతు
కొత్తపల్లి వాగులో గల్లంతు

By

Published : Aug 29, 2021, 10:18 PM IST

Updated : Aug 29, 2021, 10:51 PM IST

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం కొత్తపల్లి వాగులో కారు గల్లంతయింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలతో బయటపడగా.. మరొకరు గల్లంతయ్యారు. వాగును దాటుతున్న సమయంలో.. ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ముగ్గురు వ్యక్తులు కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు. కారులో వాగు దాటుతున్న ఇద్దరు.. వాహనం సహా గల్లంతయ్యారు. వాగులో కొట్టుకుపోతూ చెట్టును పట్టుకున్న ఒకరిని స్థానికులు కాపాడారు. మరొకరి ఆచూకీ తెలియలేదు. గల్లంతైన వ్యక్తి వెంకటయ్యగా గుర్తించారు. కౌకుంట్లలో కుమార్తె ఇంటికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. చేవెళ్ల మండలం ఎనికేపల్లి నుంచి కౌకుంట్ల వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రాత్రి కావడం వల్ల కారు సహా గల్లంతైన వారి ఆచూకీ తెలియడం లేదని స్థానికులు తెలిపారు.

కొత్తపల్లి వాగులో కారుతో సహా ఒకరు గల్లంతు

మంత్రి ఆదేశాలు..

వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ప్రజలను కోరారు. భారీ వర్షాల వల్ల వికారాబాద్ జిల్లాతో పాటు, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని పలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​, ఎస్పీకి మంత్రి ఆదేశించారు.

మర్పల్లి వాగులో గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నవాబుపేట్​ మండలం ఫుల్​మామిడి, శంకర్​పల్లి మండలం కొత్తపల్లి వాగు, మర్పల్లి మండలం సిరిపురం వద్ద చోటు చేసుకున్న సంఘటనల పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీలు వాగుల వద్ద గస్తీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయా పోలీస్​ స్టేషన్​ల పరిధిలో వాగులు, వంకలు, కాల్వల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని వికారాబాద్​ ఎస్పీని మంత్రి ఆదేశించారు.

ఇదీ చూడండి:Flipcart: ఫ్లిప్​కార్ట్ పార్శిళ్లలో రాళ్లు, పెంకులు... నలుగురు అరెస్ట్

Last Updated : Aug 29, 2021, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details