ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం మూలంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అహ్మద్‌నగర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన తలారి అంజయ్య(40) మూడురోజుల క్రితం జ్వరంతో వైద్యున్ని సంప్రదించాడు. ఆర్ఎంపీ అతని కాలుకు ఇంజెక్షన్ ఇవ్వడంతో బాగా వాపు వచ్చింది. మళ్లీ అతని వద్దకే వెళ్లగా తగ్గుతుందని సర్ది చెప్పాడు.
ఆర్ఎంపీ వైద్యం వికటించి ఒకరి మృతి - సంగారెడ్డి జిల్లాలో ఆర్ఎంపీ నిర్లక్ష్యం
ఆర్ఎంపీ వైద్యం వికటించడంతో ఓ వ్యక్తి బలయ్యాడు. మూడురోజుల క్రితం జ్వరంతో వచ్చిన వ్యక్తికి ఇంజెక్షన్ ఇవ్వగా కాలు బాగా వాపు వచ్చి మృతి చెందాడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అహ్మద్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది.
![ఆర్ఎంపీ వైద్యం వికటించి ఒకరి మృతి One person died with rmp doctor negligence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11385028-83-11385028-1618297094502.jpg)
ఆర్ఎంపీ వైద్యుని నిర్లక్ష్యానికి ఒకరు మృతి
కానీ అంజయ్య కుమారుడు రమేశ్ నర్సాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మరో చోటికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో చేసేదేమిలేక సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం రాత్రి మృతి చెందాడు. కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.