తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆపరేషన్‌ వికటించి యువకుడు మృతి - వైద్యుని నిర్లక్ష్యంతో యువకుడు మృతి

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో దారుణం జరిగింది. వైద్య వికటించి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఐనవోలు మండలం కక్కిరాలపల్లికి గ్రామానికి చెందిన కంజర్ల విజయ్‌ మొలల ఆపరేషన్‌ విఫలమై మృతి చెందాడు.

one person died with doctor negligence
డాక్టర్ నిర్లక్ష్యానికి యువకుడు మృతి

By

Published : Apr 7, 2021, 6:17 PM IST

ఆపరేషన్ వికటించి ఓ యువకుడు మృతి చెందిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. ఐనవోలు మండలం కక్కిరాలపల్లికి చెందిన కంజర్ల విజయ్‌(22) పైల్స్‌ ఆపరేషన్‌ విఫలమవడంతో మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహించిన బాధితుని కుటుంబసభ్యులు ఆస్పత్రి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు.

వివరాల్లోకి వెళ్తే....

కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన కంజర్ల విజయ్ వర్ధన్నపేటలోని ప్రియాంక క్లినిక్‌లో ఆపరేషన్‌ కోసం చేర్పించారు కుటుంబ సభ్యులు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ మహేష్ కుమార్ మొలల ఆపరేషన్‌ చేశారు. ఇంతలోనే అతని పరిస్థితి విషమించి మృతి చెందాడు. వైద్యుని నిర్లక్ష్యమే మృతికి కారణమని అగ్రహానికి గురైన కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో డాక్టర్ మహేశ్ కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:ప్రభుత్వ అధికారుల కోర్టు ధిక్కరణ చర్యలపై హైకోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details