తెలంగాణ

telangana

ETV Bharat / crime

తోటికోడళ్ల పంచాయితీ.. అన్న దాడి.. తమ్ముడు మృతి - తెలంగాణ వార్తలు

తోటి కోడళ్ల పంచాయితీ కాస్త ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తోటి కోడళ్లు గొడవ పడుతుండగా ఆ అన్నదమ్ములు కలుగజేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అన్న తమ్ముడిపై రోకలిబండతో మోదాడు. తీవ్ర గాయాల పాలైన తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడు.

one-person-died-in-two-women-conflict-at-errakunta-thanda-chintalapalem-mandal-in-suryapet-district
తోటి కోడళ్ల పంచాయితీ.. అన్న దాడి... తమ్ముడు మృతి

By

Published : Jan 29, 2021, 1:53 PM IST

తోటి కోడళ్ల పంచాయితీ క్రమంగా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. భార్యల పంచాయితీలో కలగజేసుకున్న అన్మదమ్ముల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆగ్రహించిన అన్న తమ్ముడిని రోకలి బండతో మోదాడు. తీవ్ర గాయాలపాలైన తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల కథనం ప్రకారం...

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం ఎర్రకుంట తండాలో కుటుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఎర్రకుంట తండాకు చెందిన వాంకుడోత్ బుజ్యా, సుగ్రీవ నాయక్​లు సోదరులు. సుగ్రీవ నాయక్ భార్యకు, బుజ్యా నాయక్ భార్యకు మధ్య బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఘర్షణ చెలరేగింది. ఇరువురి మధ్య వాగ్వాదం పెరగడం వల్ల అన్న భార్య మీద దాడికి సుగ్రీవ ప్రయత్నించాడు.

ఆగ్రహించిన అన్న బుజ్యా రోకలి బండతో తమ్ముడు సుగ్రీవ తలపై గట్టిగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన సుగ్రీవను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం సుగ్రీవ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ సీఐ శివ రాంరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details