Train Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బొగ్గు తరలించే రైలు కింద పడి చూస్తుండగానే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇల్లందు పట్టణం జగదాంబ సెంటర్‌కు చెందిన ఇసాక్(50) సైకిల్‌పై పని నిమిత్తం స్టేషన్ బస్తీకి వెళ్తున్నాడు. ఆ మార్గంలో ఇల్లందు నుంచి డోర్నకల్ వైపు బొగ్గు తరలించే రైల్వే మార్గం ఉంది. ఈ క్రమంలో సైకిల్ అదుపుతప్పి బొగ్గు లోడుతో వెళ్తున్న రైలు కింద పడిపోయాడు. ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోయాయి. తీవ్రగాయాలతో బాధపడుతున్న బాధితుడి పరిస్థితి చూసిన స్థానికులు 108 నెంబర్‌కు ఫోన్ చేశారు. అరగంట అయినా అంబులెన్స్ రాకపోవటంతో అతన్ని ఒక ట్రాలీ వాహనంలో ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
LIVE VIDEO: సైకిల్ మీది నుంచి నేరుగా రైలు కిందికి.. - accident
Train Accident: రైలు కింది పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
LIVE VIDEO: రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.. ఎలా అంటే?
పరిస్థితి విషమించడంతో వైద్యులు ఖమ్మం తరలించాలని సూచించారు. వెంటనే ఖమ్మంకు తరలించగా.. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఘటనపై ఆరా తీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: