తెలంగాణ

telangana

ETV Bharat / crime

హత్యా... ఆత్మహత్యా.. మృతిపై పలు అనుమానాలు.! - అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

one person died in suspected situation
అనుమానాస్పదస్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

By

Published : Apr 25, 2021, 7:52 PM IST

అనుమానాస్పదస్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని గాయత్రి అపార్ట్​మెంట్​ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తిగా గుర్తుపట్టని విధంగా ఉండటంతో అతను రెండురోజుల క్రితమే మృతిచెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుడి వయసు సుమారు 40కి పైగా ఉండొచ్చని భావిస్తున్నారు. అతని వద్ద ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిలో పలు కీలక ఆధారాలను సేకరించారు.

మృతిపై అనుమానాలు...

అతని చేతి మణికట్టు వద్ద లోతైన గాయమవ్వడం, ఘటనాస్థలంలో రక్తపు మరకలు ఉండటంతో మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎవరైన హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారా లేదా ఆత్మహత్య అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.:

ఇదీ చూడండి:జైన తీర్థంకరుల పాదముద్రలతో తెలంగాణ పావనమైంది: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details