తెలంగాణ

telangana

ETV Bharat / crime

టవేరాను ఢీకొన్న ద్విచక్రవాహనం... వ్యక్తి మృతి - telangana varthalu

టవేరాను ద్రిచక్రవాహనం ఢీకొన్న ఘటన కొడంగల్​లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

one person died in road accident
టవేరాను ఢీకొన్న ద్విచక్రవాహనం

By

Published : Apr 9, 2021, 9:59 AM IST

వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రంలో హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే అంతరాష్ట్ర రహదారిపై తెల్లవారు జామున 4గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. టవేరాను ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో బొంరాస్​పేట గ్రామానికి చెందిన గడ్డల బాలు(32) అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా... కోట్ల యాదయ్య (30) అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వీరు కొడంగల్ మండలం లక్ష్మీపల్లిలోని యాదయ్య అత్తగారింటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇదీ చదవండి:బైక్ కింద పడి ఆరేళ్ల బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details