కూతురును పాఠశాల వద్ద దింపి టాటా చెప్పాడు. అంతలోనే అనంతలోకాలకు వెళ్లాడు. ఖమ్మం బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఖమ్మం నగరంలో నివాసం ఉండే యల్.రాజశేఖర్ తల్లాడ మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 10వ తరగతి చదువుతున్న తన కూతురును పాఠశాల వద్ద దించేందుకు వచ్చాడు. పాపను దించి కొద్ది దూరం వెళ్లి మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొంది. దీంతో తీవ్రగాయాలు అయిన రాజశేఖర్‌ను హైదరాబాద్ తరలిస్తుండగా మధ్యలో సూర్యాపేట వద్ద మృతి చెందారు.
LIVE Video: కూతురును పాఠశాల వద్ద దింపి.. అంతలోనే అనంతలోకాలకు.. - ts news
పదో తరగతి చదువుతున్న తన కూతురును పాఠశాల వద్ద దించేందుకు వచ్చాడు. పాపను దించి కొద్ది దూరం వెళ్లి మలుపు తిరుగుతుండగా కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
LIVE Video: కూతురును పాఠశాల వద్ద దింపి.. అంతలోనే అనంతలోకాలకు..
ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కాగా రాజశేఖర్ టీఎస్ యూటిఎఫ్ తల్లాడ మండల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య బోనకల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఉన్నారు. వారికి ఒక బాబు, ఒక కూతురు ఉన్నారు. ఆయన మరణం ఉపాధ్యాయ వర్గాల్లో విషాదం నింపింది.
ఇవీ చదవండి: