ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం సిద్దులుర్లో చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న చాకలి నర్సింహులు(65)ను వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టడంతో... అక్కడికక్కడే మరణించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు.
డ్రైవర్ నిర్లక్ష్యానికి.. ఒకరు బలి - తెలంగాణ వార్తలు
డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డ్రైవర్ నిర్లక్ష్యానికి.. ఒకరు బలి
ఆటోలో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆరా తీయగా మద్యం తాగినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.