Accident at Narsingi: రంగారెడ్డి జిల్లా నార్సింగి అప్పా జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు యజమాని నిర్లక్ష్యం కారణంగా.. ఆ వెనుకే బైక్‌పై వస్తున్న వ్యక్తి రక్తమోడుతూ మృతి చెందాడు. కారు రన్నింగ్‌లో ఉండగా.. ఉమ్మి వేసేందుకు యజమాని ఎల్లయ్య అకస్మాత్తుగా కారు డోర్ తీశాడు. ఇది గమనించని ద్విచక్రవాహనదారుడు ఒక్కసారిగా కారు డోర్‌కు తగిలి గాల్లోకి ఎగిరి అవతలి వైపు రహదారిపై పడ్డాడు. అదే క్రమంలో అటుగా వస్తున్న లారీ.. అతనిపై నుంచి దూసుకెళ్లడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మేస్త్రిగా గుర్తించారు. నిర్లక్ష్యంగా రన్నింగ్ కారు డోరు తెరిచిన ఎల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రన్నింగ్‌లో ఉన్న కారు డోర్ తీసిన యజమాని.. ఆ కాసేపటికే.. - one person died in road accident at narsingi appa junction
Accident at Narsingi: మృత్యువు ఏ వైపు నుంచి ఎలా దూసుకువస్తుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు.. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ముందువెనకా ఉన్న వాహనదారులు.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా వారి నిర్లక్ష్యానికి ఇవతలి వాళ్లు బలి కావాల్సిందే. అలాంటి సంఘటనే హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. ఓ కారు యజమాని నిర్లక్ష్య డ్రైవింగ్‌కు నిండు ప్రాణం బలైంది.
నార్సింగి రోడ్డు ప్రమాదం