సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అన్నాసాగర్ దర్గా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం వ్యాన్.. ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో బేగరి శ్రీనివాస్ అనే హోంగార్డ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాడులుర్కు చెందిన శ్రీనివాస్ మోటార్ సైకిల్‌పై స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న డీసీఎం.. హోంగార్డు మృతి - sangareddy today crime news
ద్విచక్రవాహనాన్ని.. డీసీఎం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో చోటు చేసుకుంది. మృతుడు మెదక్ డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న డీసీఎం.. హోంగార్డు మృతి
మృతుడు మెదక్ డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు... జోగిపేట ఎస్సై వెంకట రాజా గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:హతమార్చి, ప్రమాదాలుగా చిత్రీకరించి కోట్లలో క్లెయిమ్‌లు..