తెలంగాణ

telangana

ETV Bharat / crime

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి - సంగారెడ్డి తాజా వార్తలు

తన భార్యను డ్యూటీకి పంపి తిరిగి వస్తున్న భర్తను లారీ రూపంలో మృత్యువు కబళించింది. డివైడర్ దాటుతుండగా వెనక నుంచి లారీ ఢీకొనడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది.

బైక్‌ లారీ ప్రమాదం, సంగారెడ్డి వార్తలు
accident at sangareddy, sangareddy news

By

Published : May 18, 2021, 12:18 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కొండాపుర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన డప్పు శ్రవణ్ కుమార్‌గా గుర్తించారు. డివైడర్ దాటుతుండగా వెనక నుంచి లారీ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

తన భార్యను డ్యూటీకి పంపి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో విజిలెన్స్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్ర సరిహద్దులో 445 బస్తాల ధాన్యం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details