హైదరాబాద్ బాహ్య వలయ రహదారిపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న వ్యక్తి అరవై శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా నార్సింగి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కారులో చెలరేగిన మంటలు.. చికిత్స పొందుతూ ఒకరు మృతి - కారు ప్రమాదంలో ఒకరు మృతి
కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి మృతి చెందాడు. అరవై శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి సమీపంలోని బాహ్యవలయ రహదారిపై జరిగింది.
బాహ్యవలయ రహదారిపై కారులో మంటలు
వెంటనే టోల్ గేట్ ఉద్యోగులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడు గండిపేట మండలం ఓటినాగులపల్లికి చెందిన మాణిక్యంగా పోలీసులు గుర్తించారు. అతివేగంగా వచ్చి డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.