తెలంగాణ

telangana

ETV Bharat / crime

ద్విచక్రవాహనాలను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి - బొంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

వికారాబాద్​లో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దోమ మండలం బొంపల్లి గ్రామ శివారులో రెండు ద్విచక్రవాహనాలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కు తరలించారు.

one person died and three seviour injured in  road accident at  bompally in doma mandal in vikarabad district
ద్విచక్రవాహనాలను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

By

Published : Mar 21, 2021, 5:23 PM IST

రెండు ద్విచక్రవాహనాలను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్​ జిల్లా దోమ మండలం బొంపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని పరిగి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కు తరలించారు.

ప్రమాదం జరిగిందిలా..

పరిగి నుంచి మహబూబ్​నగర్​ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బొంపల్లి గ్రామ శివారుకు రాగానే ఎదురుగా వస్తున్న రెండు బైకులు ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో బస్ డ్రైవర్ వారిని తప్పించే ప్రయత్నం చేశాడు. రెండు ద్విచక్రవాహనాలు బస్సును ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాహనదారులకు తీవ్ర గాయాలు కావడంతో... స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పాలేపల్లి గ్రామానికి చెందిన శివయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:'ఏ ప్రభుత్వమూ మా సంక్షేమానికి కృషి చేయలేదు'

ABOUT THE AUTHOR

...view details