ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది.
వాహనదారులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరి మృతి - ఉప్పల్లో లారీ బీభత్సం
హైదరాబాద్లోని ఉప్పల్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ రింగ్రోడ్డుకి వస్తున్న లారీ ఆగి ఉన్న బైక్ను ఢీకొట్టగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
వాహనదారులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరి మృతి
ఎల్బీనగర్ నుంచి వస్తున్న లారీ వాహనదారులపైకి దూసుకెళ్లింది. ప్రధాన రహదారిలో నిలిచిన వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు బైక్‌లు, కారు, ఆటో, డీసీఎం వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.