రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ఎస్సారెస్పీ వరద కాలువలో గొర్రెల కాపరి బుచ్చన్నగారి ప్రశాంత్ (23) మృతిచెందాడు. రెండు నెలల కిందట మెదక్ జిల్లా దుబ్బాక మండలం గంభీర్ పూర్ గ్రామం నుంచి కొందరు గొర్రెలు తీసుకుని మధ్య మానేరు ప్రాజెక్టు పరిసరాలకు చేరుకున్నారు.
ఎస్సారెస్పీ కాలువలో ఈతకు వెళ్లి గొర్రెల కాపరి మృతి - rajanna siricilla district latest news
ఎస్సారెస్పీ వరద కాలువలో ఈతకు వెళ్లి గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన... రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో చోటు చేసుకుంది. మృతుడు మెదక్ జిల్లా దుబ్బాక మండలం గంభీర్ పూర్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
వరద కాలువలో ఈతకు వెళ్లి గొర్రెల కాపరి మృతి
ఇదే క్రమంలో సరదాగా వరదవెల్లి వద్ద వరద కాలువలో ఈతకు దిగిన ప్రశాంత్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. కాలువలో నీరు నిండుగా ఉండటంతో మిగతా మిత్రులు నిస్సహాయ స్థితిలో ఉండి పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: వివేకా హత్య కేసు: విచారణ అనంతరం దిల్లీకి సీబీఐ అధికారులు