ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన... హైదరాబాద్ కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. కార్తీక్ అనే వ్యక్తి మద్యం సేవించి శుక్రవారం మధ్యాహ్నం కారులో బయలుదేరాడు. ఐడీఎల్ చెరువు రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు.
కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి - Hyderabad latest news
మద్యం మత్తులో కారు నడపకండి, ప్రమాదాలకు కారణమవ్వకండి అంటూ... పోలీసులు ఎంతగా అవగాహన కల్పించిన మందుబాబులు మాత్రం మారటం లేదు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ద్విచక్ర వాహనదారుడు శివను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అదే వేగంతో కారు చెట్టును ఢీకొట్టడంతో... మంటలు చెలరేగి కారు, ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: రఘురామకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు