గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన... కరీంనగర్ జిల్లా పెద్దపల్లి బైపాస్ వద్ద చోటుచేసుకుంది. మృతుడు నగరంలోని కిసాన్ నగర్‌కు చెందిన రాజ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Accident: ప్రమాదవశాత్తు లోయలో పడిన ద్విచక్రవాహనం
ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మరో ఘటనలో ప్రమాదవశాత్తు... రేకుర్తి వంతెనపై నుంచి ద్విచక్రవాహనం లోయలో పడి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదవశాత్తు లోయలో పడిన ద్విచక్రవాహనం
మరో ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు... రేకుర్తి వంతెన పైనుంచి లోయలో పడిపోయారు. అది గమనించిన వాహనదారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులను సిబ్బంది రక్షించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు కొత్తపల్లి మండలం రాణీపూర్ గ్రామానికి చెందిన మహేందర్, ప్రశాంత్ గా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: అవినీతి కేసులో మాజీ హోంమంత్రి సహాయకుల అరెస్ట్!