వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం తోమాలపల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన శివ… పెబ్బేర్ నుంచి తోమాలపల్లి వైపు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు కొత్తకోట సీఐ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - తెలంగాణ వార్తలు
వనపర్తి జిల్లా తోమాలపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మృతుడు విభాగిని మధ్యలో ఉన్న మొక్కల్లో ఎగిరిపడినట్లుగా స్థానికులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, తోమాలపల్లిలో రోడ్డు ప్రమాదం
ఈ ప్రమాదంలో మృతుడు విభాగిని మధ్యలో ఉన్న మొక్కల్లో ఎగిరిపడినట్లుగా పేర్కొన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.
ఇదీ చదవండి:Farmers: ఎస్సై కాళ్లపై పడి రైతుల విజ్ఞప్తి