తెలంగాణ

telangana

ETV Bharat / crime

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్​.. ఒకరు మృతి - రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా వార్తలు

ద్విచక్రవాహనాన్ని ఇసుక టిప్పర్ ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుప్రతికి తరలిస్తుండగా బంధువులు, గ్రామస్థులు అడ్డుకుని... తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

One person dead in accident
ఇసుక టిప్పర్​ ఢీకొని ఒకరు మృతి

By

Published : Jun 18, 2021, 7:50 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​ మండలం తెర్లుమద్దికి చెందిన బైతి దేవయ్య (48), బైతి కొమురయ్య ఇద్దరు అన్నదమ్ములు. బ్యాంకులో ధాన్యం డబ్బులు తీసుకోవడానికి స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంపై ఇద్దరు కలిసి మండల కేంద్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో ముస్తాబాద్‌ శివారులో ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్‌ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దేవయ్య తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కొమురయ్యకు తీవ్రగాయాలయ్యాయి.

పరిస్థితి విషమంగా ఉన్న కొమురయ్యను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. దేవయ్య మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుప్రతికి తరలిస్తుండగా బంధువులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. న్యాయం జరిగేంతవరకు కదిలేదిలేదంటూ ఆందోళన చేపట్టారు. టిప్పర్‌ యజమానితో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

ఇదీ చదవండి: 'మూడో దశ ప్రభావం పిల్లలపై ఉండదు'

ABOUT THE AUTHOR

...view details