ఎంపీ పేరుతో మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్ పేరు చెప్పి క్యాన్సర్ రోగి నుంచి రూ.2 లక్షల రూపాయలు మోసం చేశారని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సొమ్ము ఇప్పిస్తానని అలీ ఖాద్రి అనే వ్యక్తి మోసగించినట్లు ఎంపీకి నజీర్ ట్వీట్ చేశాడు.
ఎంపీ సంతోశ్ కుమార్ పేరుతో రెండు లక్షల టోకరా.. ట్విట్టర్లో ఫిర్యాదు - ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులు ఇప్పిస్తామని టోకరా
రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్ పేరుతో ఓ వ్యక్తి రెండు లక్షల రూపాయల మోసానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి డబ్బులు ఇప్పిస్తానని నమ్మించినట్లు నజీర్ అనే వ్యక్తి ఎంపీకి ట్వీట్ చేశారు.
![ఎంపీ సంతోశ్ కుమార్ పేరుతో రెండు లక్షల టోకరా.. ట్విట్టర్లో ఫిర్యాదు one person cheated a cancer patient two lakhs money with the name of mp santhosh kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10735962-644-10735962-1614012565539.jpg)
ఎంపీ పేరుతో రెండు లక్షలకు టోకరా.. ట్విట్టర్లో ఫిర్యాదు
దీనిపై స్పందించిన సంతోశ్ కుమార్ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కోరారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.