తెలంగాణ

telangana

ETV Bharat / crime

GOLD SMUGGLING: శంషాబాద్‌ విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత - telangana crime news

GOLD SMUGGLING
GOLD SMUGGLING

By

Published : Sep 3, 2021, 3:34 PM IST

Updated : Sep 3, 2021, 4:41 PM IST

15:32 September 03

శంషాబాద్‌ విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిలో బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు.. బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లగేజీని తనిఖీ చేయగా పేస్ట్‌ రూపంలో బంగారం తెచ్చినట్లు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.43.55 లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.  

నిన్న కూడా సుమారు 24 లక్షల విలువైన 495 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్​ నుంచి చెప్పులు, ఫేస్‌ క్రీము, హెయిర్‌ స్ట్రయిట్‌నర్‌లో దాచుకుని తీసుకురావడాన్ని గుర్తించిన అధికారులు.. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్ట్​ చేశారు. .

ఇదీచూడండి:gold seized: అధికారులే అవాక్కయ్యేలా... ఇలా కూడా బంగారం తరలించొచ్చా..!

Last Updated : Sep 3, 2021, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details