ఓ ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో భర్త మృతిచెందగా... భార్య తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ శివారులో జరిగింది. వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం నాజీ తండాకు చెందిన రాంచంద్రు, అతని భార్య కమలమ్మ మహబూబాబాద్‌లోని బంధువు చనిపోవడంతో అక్కడికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం గురువారం తెల్లవారు జామున ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు.
బైక్‌ను ఢీ కొట్డిన లారీ.. భర్త మృతి.. భార్యకు తీవ్రగాయాలు - One killed in road accident in Mahabubabad district
మహబూబాబాద్ జిల్లా బొద్దుగొండ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతోన్న దంపతులను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి.
బొద్దుగొండ గ్రామంలో రోడ్డు ప్రమాదం
ఈ క్రమంలో బొద్దుగొండ గ్రామ శివారుకు చేరుకోగానే వారి వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామచంద్రు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ కమలమ్మను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:'ప్రేమ పేరుతో పెళ్లి.. ఆ తర్వాత వ్యభిచారానికి ఒత్తిడి!'