తెలంగాణ

telangana

ETV Bharat / crime

bike accident in dundigal: అతివేగానికి యువకుడు బలి - దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం

bike accident in dundigal: నిర్లక్ష్యం కారణంగా ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో దినేష్​ అనే యువకుడు అక్కడిక్కడే మరణించాడు. యువకుడి మరణం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

bike accident in medchal
ప్రమాదానికి గురైన వాహనం

By

Published : Feb 7, 2022, 1:35 PM IST

bike accident in dundigal: మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో అతివేగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. ఈ ఘటనలో దినేష్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు.

ప్రమాదానికి గురైన వాహనం

ఏం జరిగిందంటే...

గుర్రంగూడకు చెందిన దినేష్(24) ఓ గోల్డ్ లోన్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలె ఓ ఖరీదైన ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై దుండిగల్‌లోని ఎమ్ఎల్ఆర్ కళాశాల వైపు వచ్చిన అతడు అనంతరం తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిన ద్విచక్రవాహనం చెట్టుకు గుద్దుకుని యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు

ఇదీ చదవండి:Couples suicide: రైలు కిందపడి ఆర్మీ దంపతుల ఆత్మహత్య.. కారణమదే..!

ABOUT THE AUTHOR

...view details