ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు చనిపోగా.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం సమీపంలో గురువారం రాత్రి జరిగింది.
స్వగ్రామానికి వస్తుండగా..
వీర్యానాయక్ తండాలోని లకావత్ నితిన్ (19), సూర్యానాయక్ తండాకు చెందిన లునావత్ భాస్కర్.. సూర్యాపేట నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తున్నారు. తిమ్మాపురం సమీపంలో కేతెపల్లి మండలం కొత్తపేటవాసి తండు సందీప్.. జిల్లా కేంద్రానికి వెళ్తుండగా ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.