కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చిక్లి వాగుపై ఉన్న పాత వంతెనను కొద్దిగా కూల్చి వదిలేశారు. సగం కూల్చిన వంతెనపై బీఎస్ఎన్ఎల్ కేబుల్‌ను తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు మిగిలిన వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు శిథిలాల్లో చిక్కుకుని మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
వంతెన కూలి.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు - asifabad district crime news
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పాత వంతెనను కొద్దిగా కూల్చి వదిలేశారు. అదే వంతెనపై ఎక్కి కేబుల్‌ను తొలగించే క్రమంలో మిగిలిన వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
వంతెన కూలి ఒకరు మృతి, కూలిన వంతెన, వాంకిడిలో కూలిన వంతెన
బ్రిడ్జి పడుతున్న సమయంలో అటుగా వెళ్తున్న వాంకిడికి చెందిన కానిస్టేబుల్ శేషారావు చూశారు. వెంటనే స్పందించి ఒక క్షతగాత్రుణ్ని బయటకు లాగి.. కాపాడాడు. మరొకరు పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోవడం వల్ల కాపాడలేకపోయారు. మృతుడు మహారాష్ట్ర చంద్రాపూర్ వాసి సూరజ్‌గా పోలీసులు గుర్తించారు.
- ఇదీ చదవండి :ఆత్మహత్యలకు చిరునామాగా మారుతున్న రైల్వేట్రాక్‌లు