తెలంగాణ

telangana

ETV Bharat / crime

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. కండక్టర్​కు స్వల్ప గాయాలు - bus accident in warangal rural district

ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కండక్టర్​కు స్వల్ప గాయాలైన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులో చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

bus accident, rtc bus accident
బస్సు ప్రమాదం, ఆర్టీసీ బస్సు ప్రమాదం

By

Published : Apr 2, 2021, 1:00 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు కింది వైపునకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళా కండక్టర్​కు స్వల్ప గాయాలయ్యాయి.

నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. వరంగల్​ వెళ్తుండగా.. లక్నేపల్లి దాటుతుండగా.. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు కిందవైపునకు దూసుకెళ్లింది. గాయపడిన కండక్టర్​ను స్థానికులు నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details