భక్తి, విశ్వాసం ముసుగులో ఏపీలోని కర్నూలు జిల్లా(Kurnool district) హొలగుంద మండలం దేవరగట్టు(DEVARAGATTU) లో ఏటా కర్రల సమరం నిర్వహించటం ఆనవాయితీ. ఏటా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. ఓ వర్గం వారిని మరో వర్గం అడ్డుకోవడం, ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకోవటం వల్ల ఎంతో మందికి తీవ్రగాయాలై మరణించిన ఘటనలూ ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అధికారులు చేపట్టిన చర్యలు ఫలించలేదు.
బన్ని ఉత్సవం ...
ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వర స్వామి ఆలయం వెలసింది. ఈ గుడిలోని దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరునికి దసరా పర్వదినాన కల్యాణం జరిపించి.. కొండ పరిసర ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. దీనినే బన్ని ఉత్సవం(Bunny festival) అని కూడా పిలుస్తారు.