తెలంగాణ

telangana

ETV Bharat / crime

సోదరుడి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వెళ్తూ ప్రమాదంలో మృతి - telangana news

తమ్ముడి వివాహ పత్రికను బంధువులకు ఇవ్వడానికి వెళ్తూ ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా సోన్​ మండలంలోని కడ్తాల్​లో చోటుచేసుకుంది.

nirmal district news, road accident, road accident in nirmal
నిర్మల్ జిల్లా వార్తలు, నిర్మల్​లో వ్యక్తి మృతి, నిర్మల్​లో రోడ్డు ప్రమాదం

By

Published : May 24, 2021, 3:34 PM IST

తమ్ముడి వివాహ పత్రికలను బంధువులకు పంచేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మహారాష్ట్రలోని కిన్వాట్ తాలూకా సవర్గామ్ తండాకు చెందిన మల్లారి రబాదే (36) అనే వ్యక్తి సోమవారం తన ద్విచక్రవాహనంపై నిజామాబాద్​లోని బంధువులకు పెళ్లి పత్రికలు పంచేందుకు బయలుదేరాడు.

మార్గమధ్యలో నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ జాతీయ రహదారిపై వై-జంక్షన్ వద్ద ఆర్మూర్ నుంచి వస్తోన్న వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. బైక్​పై ఉన్న వ్యక్తి హెల్మెట్ పగిలి ఎడమ వైపు తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details