నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని 167వ జాతీయ రహదారిపై వడ్వాట్ రోడ్డు సమీపంలో ద్విచక్రవాహనాన్ని బొలెరో ఢీకొట్టింది. ఈ ఘటనలో మక్తల్‌కు చెందిన శరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న హరీశ్ అనే మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. యువకుడి మృతి - one died when bolero hits bike in makthal
ద్విచక్రవాహనాన్ని బొలెరో ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
మక్తల్ ప్రమాదం, యువకుడు మృతి
శరణ్, హరీశ్.. ఇద్దరు మిత్రులు.. పనిమీద క్రిష్ణా మండలంలోని ముడుమల గ్రామానికి వెళ్లారు. తిరిగి మక్తల్‌కు వెళ్తుండగా.. మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. శరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన హరీశ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
- ఇదీ చదవండి :రోడ్డు ప్రమాదం.. తీసింది నెమలి ప్రాణం