అతివేగంతో వస్తున్న లారీ.. ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ల నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేప్టటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొత్తపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
లారీ డ్రైవర్ అతివేగానికి నిండు ప్రాణం బలి - lorry collided with auto at kothapally
లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు నిండు ప్రాణం బలైపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి వద్ద ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
జూబ్లీనగర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జెల్ల తిరుపతి(42).. కొత్తపల్లి వైపు వస్తుండగా మితిమీరిన వేగంతో వస్తున్న లారీ అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో తిరుపతి అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహంపై పడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపించారు. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి:ఆస్తి కోసం సొంత అన్నయ్యనే చంపేశాడు..!