జాతీయ రహదారిపై డీసీఎం, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నూరు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన శేఖర్, మరో వ్యక్తి.. ట్రాక్టర్‌పై చెన్నూర్ వైపు వస్తుండగా కోటపల్లి వైపు వస్తున్న డీసీఎం ఢీ కొట్టింది.
డీసీఎం, ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి - one died in road accident in national highway chennoor mancherial
మంచిర్యాల జిల్లా చెన్నూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం, ట్యాంకర్ ఎదురెదురుగా ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
![డీసీఎం, ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి road accident in chennoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11372105-179-11372105-1618208672335.jpg)
చెన్నూర్‌లో రోడ్డు ప్రమాదం
ఘటనలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Apr 12, 2021, 3:14 PM IST