రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. చెట్టుపైన మృతదేహం..!
Accident: భయంకరమైన ప్రమాదం.. చెట్టుపైన మృతదేహం..! - రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. చెట్టుపైన మృతదేహం..!
ఇదో భయంకరమైన ప్రమాదం.. అత్యంత వేగంగా దూసుకువచ్చిన ఓ కారు రోడ్డు మీద వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఢీకొన్న ఘటనలో ఓ యువకుడి ప్రాణం ‘గాలి’లో కలిసిపోయింది. ఆ యువకుడు ఏకంగా ఎగిరి చెట్టుకొమ్మకు చిక్కుకొని అక్కడే మృతిచెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దోస్తునగర్ సమీపంలో చోటుచేసుకుంది.
![Accident: భయంకరమైన ప్రమాదం.. చెట్టుపైన మృతదేహం..! one died in car and bike accident at dostunagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12079345-561-12079345-1623296825559.jpg)
one died in car and bike accident at dostunagar
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.