Accident: అదుపుతప్పిన ద్విచక్రవాహనం.. యువకుడు మృతి - accident news
సాఫీగా సాగుతున్న వారి ప్రయాణాన్ని ఆ మూలమలుపు మరో మలుపు తిప్పింది. వేగంగా వెళ్తున్న వారి ద్విచక్రవాహనం అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది.
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుంటపల్లి శివారులో ప్రమాదం సంభవించింది. మద్దిరాలకు చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై మహబూబాబాద్ వెళ్తుండగా కుంటపల్లి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద అదుపుతప్పి పడిపోయారు. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు యువకులలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రున్ని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరణించిన యువకుడు కరింగుల సతీశ్, గాయపడిన వ్యక్తి శ్రీదర్ రెడ్డిగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సతీశ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.