సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ ట్యాంకర్ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో పొగంటి సతీశ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్సై శ్రీనివాస్ నాయక్ తెలిపారు.
సిమెంట్ ట్యాంకర్ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి - suryapet district latest news
సిమెంట్ ట్యాంకర్ను కారు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఈ ప్రమాదం సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![సిమెంట్ ట్యాంకర్ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి mukundapuram accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11248709-324-11248709-1617343354783.jpg)
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి