కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో బోదాసు అనిల్ అనే ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
బహిర్భూమికని వెళ్లి.. అనంతలోకాలకు..! - kamareddy district latest news
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామ శివారులోని పటాకులకుంటలో ఉన్న చేపల కోసం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి కుంటలోకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. సోమవారం సాయంత్రం అనిల్ బహిర్భూమికని తన బైక్పై పటాకులకుంటకు వెళ్లాడు. ఈ క్రమంలో కుంటలోకి ఇచ్చిన విద్యుత్ కనెక్షన్ తీగ బైక్కు తగిలింది. విద్యుదాఘాతంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: వర్షానికి తడిసిన ధాన్యం.. పిడుగుపాటుకు పోయిన ప్రాణం