భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్దులమడకు చెందిన ఆరుగురు అశ్వారావుపేట నుంచి ఆటోలో వెళ్తుండగా.. సున్నంబట్టి గ్రామం వద్ద ఎదురుగా వెళ్తోన్న ట్రాక్టర్ వీరి ఆటోను ఢీకొట్టింది. అతివేగంగా ట్రాక్టర్ ఢీకొట్టడం వల్ల ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మిగిలిన ఐదుగురు గాయపడ్డారు.
ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు - tractor hits auto in kothagudem
ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సున్నబట్టిలో చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్
ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కేసు నమోదు చేసుకున్నారు. మృతుణ్ని తాటి వెంకటేశ్వర్లు(32)గా గుర్తించారు.
- ఇదీ చదవండి :కరోనా పాజిటివ్ వచ్చిందని ఉరేసుకున్నాడు