తెలంగాణ

telangana

ETV Bharat / crime

Minister Convoy accident : సభాపతి పోచారం కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి - speaker convoy hits a man in medak

Minister Convoy accident
సభాపతి పోచారం కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి

By

Published : Oct 11, 2021, 12:43 PM IST

Updated : Oct 11, 2021, 7:10 PM IST

12:41 October 11

వైద్యం సహాయం అందించే లోపే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

సభాపతి పోచారం కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి

శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పోచారం.. హైదరాబాద్ నుంచి బాన్సువాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ సమీపంలో నర్సింహా రెడ్డి అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. స్పీకర్​ కాన్వాయ్​ అతడిని ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు.

సంఘటనా స్థలానికి పోచారం వాహనం దూరంగా ఉండటంతో.. ఆయన అలాగే వెళ్లిపోయారు. విషయం తెలిసిన అనంతరం.. బాధితునికి వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వైద్య సహాయం అందేలోపే నర్సింహా రెడ్డి మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.   

మృతుడు స్థానికంగా ఓ పరిశ్రమలో దినసరి కూలీగా పని చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. ఘటనపై స్పీకర్​ విచారం వ్యక్తం చేశారు. 

Last Updated : Oct 11, 2021, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details