Student Died Hit with Bat: ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గోలివారి కొత్తూరులో విషాదం నెలకొంది. మేడపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివే సూర్య, పండు.. ఒంటిపూట బడులు కావడంతో గ్రామ శివారులో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో సైకిల్ విషయంలో బాలురు సూర్య, పండులు ఘర్షణ పడ్డారు. కింద పడిన సైకిల్‌ను సూర్య పైకి తీస్తుండగా... పండు బ్యాటు తీసుకుని తలపై కొట్టాడు. అతను కింద పడిపోవడంతో లేపి మంచినీరు తాగించి విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు.
సైకిల్ విషయంలో వివాదం... బ్యాటుతో తలపై కొట్టడంతో...! - cricket latest news
Student Died Hit with Bat: ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన స్వల్ప వివాదం... ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గోలివారి కొత్తూరులో విషాదాన్ని నింపింది. సైకిల్ విషయంలో తలెత్తిన గొడవ కారణంగా క్రికెట్ బ్యాటుతో తలపై కొట్టడంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే..?
![సైకిల్ విషయంలో వివాదం... బ్యాటుతో తలపై కొట్టడంతో...! Student killed after being hit with bat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15121876-690-15121876-1650975282685.jpg)
Student killed after being hit with bat
ఇంటికెళ్లిన సూర్య తలనొప్పిగా ఉందని పడుకున్నాడు. ఎంతసేపటికీ అతను లేవకపోవడంతో తెల్లవారు జామున 3 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సూర్య తల్లిదండ్రులు హైదరాబాద్‌లో పని చేస్తూ ఇక్కడ అమ్మమ్మ ఇంట్లో ఉంచి చదివిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:నిశ్చితార్థం రోజే యువకుడి మృతి.. హత్యా? ఆత్మహత్యా?