కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అంతంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం చెరువులో ఈతకోసం దిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఐదో తరగతి చదువుతున్న ఆంజనేయులు, బన్నీ నిన్న ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లి మునిగిపోయారు.
ఈతకెళ్లి నీటమునిగిన ఇద్దరు విద్యార్థులు... ఒకరి మృతదేహం లభ్యం.. - విద్యార్థి మృతదేహం లభ్యం
ఈత కోసం చెరువులోకి దిగిన విద్యార్థులు గల్లంతైన ఘటన మాచారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. గజ ఈతగాళ్లు ఒకరిని వెలికి తీయగా.. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఒక విద్యార్థి మృతదేహం లభ్యం... మరొకరి కోసం గాలింపు
గజ ఈతగాళ్లు చెరువులోకి దిగి ఆంజనేయులు మృతదేహాన్ని వెలికితీశారు. మరో బాలుడు బన్నీ కోసం గాలిస్తున్నారు. మృతదేహం వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చూడండి:తప్పిపోయిన బాలుడు.. వారం రోజులుగా తల్లిదండ్రుల నిరీక్షణ