ఏపీ చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్‌గేట్ సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి - Chittoor District Latest News
తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి.
![తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12495364-916-12495364-1626592561012.jpg)
accident
భక్తులు.. చెన్నై నుంచి తిరుమలకు కాలినడకన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి :హుజూరాబాద్ ఉపపోరుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి